Category: Telugu Worship Songs Lyrics

  • Turpu dikku chukka butte తూర్పు దిక్కు చుక్కబుట్టె

    తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! /2/
    చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు /2/

    బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా! /2/
    బీద కన్య గర్భమందు బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా// తూర్పు//

    పండిత శాస్త్రులనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు! /2/
    పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు// తూర్పు//

    బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు! /2/
    బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము // తూర్పు//


    Turpu dikku chukka butte – Meramma O Mariyamma..! /2/
    Chukkanu joochi memu vachhinaamu mrokki povutaku /2/

    Betelemu puramulona baaludamma – Goppa baaludamma..! /2/
    Beeda kanya garbhamandu – Buttenamma – Satyavantudamma /2/Turpu/

    Pandita saastrulanella – Bilachinaaru – vaaru vachhinaaru! /2/
    Purva vedambulanu techhinaaru – Teri chuchinaaru /2/Turpu/

    Bangaaru saambraani bolam techhinaamu – Baala Yesunoddaku..! /2/
    Bangaaru paadamula mrokkudaamu – Bahuga vededamu /2/Turpu/

  • Turpu deshapu jnaanulamu తూర్పు దేశపు జ్ఞానులము

    తూర్పు దేశపు జ్ఞానులము
    చుక్కను చూచి వచ్చితిమి /2/
    కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/

    ఓ … రాత్రి వింత తారహో
    రాజ తేజ రమ్యమౌ
    పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
    నేనర్పింతు బంగారము
    నీవంగీకరించు ప్రభో /2/
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు

    ఓ … రాత్రి వింత తారహో
    రాజ తేజ రమ్యమౌ
    పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
    నేనర్పింతు సాంబ్రాణి
    నీవంగీకరించు ప్రభో /2/
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు

    ​ఓ … రాత్రి వింత తారహో
    రాజ తేజ రమ్యమౌ
    పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్
    నేనర్పింతు బోళమును
    నీవంగీకరించు ప్రభో /2/
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు
    తూర్పు దేశపు జ్ఞానులము
    చుక్కను చూచి వచ్చితిమి /2/
    కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/


    Turpu deshapu jnaanulamu – Chukkanu choochi vachhitimi /2/
    Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/

    o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv
    Pashima dhish poyi poyi nadupu mammu shaantikin
    Nenarpintu bangaaramu – Neevangeekarinchu prabho /2/
    Halleluya Halleluya Halleluya paadutu

    o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv
    Pashima dhish poyi poyi nadupu mammu shaantikin
    Nenarpintu saambraani – Neevangeekarinchu prabho /2/
    Halleluya Halleluya Halleluya paadutu

    o… Raatri vinta taaraho – Raaja teja ramyamouv
    Pashima dhish poyi poyi nadupu mammu shaantikin
    Nenarpintu bolamu – Neevangeekarinchu prabho /2/
    Halleluya Halleluya Halleluya paadutu
    Turpu deshapu jnaanulamu – Chukkanu choochi vachhitimi /2/
    Kondalu loyaledaarulu daati memu vachhitimi /2/

  • Suddha raatri saddanaga శుద్ధరాత్రి సద్ధణంగ

    శుద్ధరాత్రి సద్ధణంగ – నందఱు నిద్రపోవ
    శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ – బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
    దివ్య నిద్ర పోమ్మా – దివ్య నిద్ర మోమ్మా

    శుద్ధరాత్రి సద్ధణంగ – దూతల హల్లెలూయ
    గొల్లవాండ్రకుఁ దెలిపెను – ఎందుకిట్టులు పాడెదరు
    క్రీస్తు జన్మించెను – క్రీస్తు జన్మించెను

    శుద్ధరాత్రి సద్ధణంగ – దేవుని కొమరుఁడ!
    నీ ముఖంబున బ్రేమ లొల్కు – నేఁడు రక్షణ మాకు వెచ్చె
    నీవు పుట్టుటచే – నీవు పుట్టుటచే

    Shuddha Raatri Saddananga – Nandaru nidrapova
    Shuddhadampatul melkonaga – Barishuddhudou Baalakudaa!
    Divya nidrapomma… – Divya nidrapomma..

    Shuddha raatri saddananga – Dootala halleluya
    Gollavaandraku delipenu – Endukittulu paadedaru
    Kreestu janminchenu – Kreestu janminchenu

    Shuddharaatri saddananga – Devuni komaruda!
    Nee mukhambuna bremalolku – Nedu rakshna maaku vachhe
    Neevu puttutache.. Neevu puttutache

  • Shantiki Dutagaa శాంతికి దూతగా

    శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
    ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/
    యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/
    Happy Christmas – Merry Christmas /4/శాంతికి /

    కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..
    పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె
    భువనాలనేలువాడు – భవనాలలోన కాదు
    పశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/

    శుభము కూర్చే – శిశువు తానై
    దిశను మార్చే – సూచనై
    పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే..
    ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/

    నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె
    దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే
    మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే – ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె
    ప్రభుకిరణం – తొలికిరణం /శాంతికి/


    Shantiki dootaga – Premaku murthigaa
    Aashala Jyotiga – Mariyaku sutunigaa /2/
    Yesu Janiyinche – Prabhu Yesu janiyinche /2/
    Happy Christmas – Merry Christmas /4/Shanti/

    Kalushitaale teliyanodu – Kanyake Janiyinche..
    Pasidi manasu kaliginodu – Pedagaa janiyinche
    Bhuvanaalaneluvaadu – Bhavanaalalona kaadu
    Pashushaalalona nelapai janiyinche
    Mana prabhuve Janiyinche /Shanti/

    Subhamu koorche – Sishuvu taanai
    Disanu maarche – Soochanai
    Paapamanti Kaarucheekatilo – oka Punyakaantiyei Prasarinche..
    Prabhu taanai – Prasarinchenila! /Shanti/

    Ningiloni divyavaani nelapai Dawhaniyinche
    Daivamanti mamata taanai – Manishigaa vudayinche
    Manaloni baadha teerche – Janajeevitaalu malache
    Yenaleni jaalilaali gunamai niliche
    Prabhu kiranam – Tolikiranam /Shanti/

  • Sambaramaaye betlehemulo సంబరమాయె బేత్లెహేములో

    సంబరమాయె బేత్లెహేములో
    సందడియాయె పశులపాకలో /2/
    ​నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా..
    యేసు అవతరించెను
    లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/

    ​దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/
    ​రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/
    రక్షణ మనకు తెచ్చాడని…
    పరుగున వెళ్లారు – యేసును చూచారు
    పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/

    తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/
    యూదుల రాజుని చూడాలని
    భక్తితో యేసుని మ్రొక్కాలని /2/
    త్వరపడి యేసుని చేరాలని..
    వేగమె వెళ్లారు – యేసుని చూచారు
    కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర/


    Sambaramaaye betlehemulo…
    Sandadiyaaye pashulapaakalo /2/
    Neetimandudu sarva shaktunigaa lokarakshakunigaa..
    Yesu avatarinchenu
    Loka rakshakunigaa Kreestu vudayinchenu /Sambara/

    Doota cheppina vaarthato Yesunu choodavelle gollalu /2/
    Rakshakudesu puttaadani – Kreeste veluguga vachhadani /2/
    Rakshana manaku techhadani..
    Paruguna vellaru – Yesunu choochaaru
    Paatalu paadaaru – Naatyam chesaaru /2/Sambara/

    Taara choopina daarilo – Yesunu choodavelle Gollalu /2/
    Yoodula raajuni choodaalani
    Bhakthito Yesuni mrokkaalani /2/
    Twarapadi Yesuni cheraalani..
    Vegme vellaaru – Yesuni choochaaru
    Kaanukalichhaaru – Yesunu poojinchaaru /2/Sambara/

  • SAMBARAALU (Chali raatiri yeduru chuse -చలి రాతిరి ఎదురు చూసే)

    చలి రాతిరి ఎదురు చూసే – తూరుపేమో చుక్క చూపే
    గొల్లలేమో పరుగునొచ్చే – దూతలేమో పొగడ వచ్చే…! //2//
    పుట్టాడు పుట్టాడురో! రారాజు – మెస్సయ్య పుట్టాడురో! మనకోసం! //2//

    పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు
    ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు /2/
    సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో //2//

    చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల వాడు
    ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు /2/
    సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలు //2//


    Chali raatiri yeduru chuse – Turupemo chukka chupe
    Gollalemo parugunochhe – Dutalemo pogadavachhe //2//
    Puttadu puttaduro raaraaju
    Messayya puttaduro manakosam! ///2//

    Pasulapaakalo paramaatmudu – Challani choopulodu sakkanodu
    Aakaasamanta mansunnodu – Nee vettivaadavaina neetiveyadu //2//
    Sambaraalu sambaraaluro – Mana bratukullo sambaraaluro //2//

    Chitalenni vunna chentacheri – Cheradeeyuvaadu premagalavaadu
    Yevaru marachina ninnu maruvananna
    Mana devudu goppa goppa vaadu /2/
    Sambaraalu sambaraaluro – Mana bratukullo sambaraaluro //2//

  • Raare chootamu raja sutuni రారె చూతుము రాజసుతుడీ

    రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
    రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో //రారె//

    దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా
    దేవుడే = మన దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున //రారె//

    కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం =
    తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే //రారె//

    బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు =
    బాల బాలికా = బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు //రారె//

    యూదవంశము – నుద్ధరింప దా -వీదుపురమున – నుద్భవించె =
    సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు //రారె//


    Raare chootamu raajasutudi reyi jananamaayenu
    Raajulaku ra-raju Messiya – Raajitambagu tejamadigo //Raare//

    Doota ganamulan – deri choodare – daiva vaakkulan – delpaga
    Devude = mana deenaroopuna – dharani karigenee – dinamuna //raare//

    Kallagaadidi – Kalayu gaadidi – golla boyila – darsanam =
    Tellagaanade – tejarilledi – Taaragaanchare – twaraga raare //raare//

    Baaludadugo – vela suryula -bolu sadguna -seeludu =
    Baala baalikaa = Baalavrudhhula nela galgina – naadhudu //Raare//

    Yudavamshamu – nuddharimpa daa-veedupuramuna
    nudbhavinche = Sadamalambagu – madini golchina
    sarvajanulaku saarvabhoumudu //raare//

  • Puttenesudu nedu పుట్టెనేసుడు నేడు

    పుట్టెనేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
    బట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయాశ్చిత్తుడు యేసు /పుట్టె /

    ధర బిసాచిని వేడిన – దు -ర్నరుల బ్రోచుటకై యా
    పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు /పుట్టె /

    యూద దేశములోను – బెత్లె -హేమను గ్రామమున
    నాదరింప నుద్భవించెను– నధములమైన మనలను/పుట్టె/

    తూర్పు జ్ఞానులు కొందఱు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
    సర్వోన్నతుని మరియ కొమరుని – కర్పణము లిచ్చిరి /పుట్టె/


    Puttenesudu nedu – manaku – punya maargamu joopanu
    patti yayyo barama gurudu – praayaschittudu Yesu /Putte/

    Dhara bisaachini vedina – durnarula brochutakai yaa
    Parama vaasi paapaharudu – Vara bhaktha jana Poshudu /Putte/

    Yuda deshamulonu – Betlehemanu graamamuna
    Naadarimpa nudbhavinche – nadhamulamaina manala /Putte/

    Turpu jnaanulu kondaru – Purva – dikku chukkanu ganchi
    sarvonnatuni Mariya komaruni – karpanamu lichhiri /putte/

  • Puttadandoy Puttadandoy పుట్టాడండోయ్ పుట్టాడండోయ్

    పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
    మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్ /2/

    బెత్లెహేము పురములో పుట్టాడండోయ్
    పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/
    గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. //2/పుట్టాడండోయ్//

    యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్
    నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/
    యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … //2//పుట్టాడండోయ్//


    Puttadandoy Puttadandoy
    Mana Yesu rakshakudu puttadandoy /2/

    Betlehemu puramulo puttadandoy
    Pashuvula saalalo puttadandoy /2/
    Golla jnaanuladaru cheri pujinchiri /2/putta/

    Yesu ninnu premistu puttadandoy
    Nee paapam koraku puttadandoy /2/
    Yesuni cherchuko rakshakuniga enchuko .. /2/putta/

  • Pashuvula paakalo devakumaarudu పశువుల పాకలో దేవకుమారుడు

    పశువుల పాకలో దేవకుమారుడు – దీనుడై పుట్టెను మానవాళికి
    ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి – గొల్లలు జ్ఞానులు పూజించిరి
    మనసే పులకించెను క్రీస్తు జన్మతో
    తనువే తరియించెను – రాజు రాకతో
    కొనియాడి కీర్తించెదము – పరవశించి ఆరాధించెదము //2//

    యూదయ దేశమున, దావీదు పురమందు
    శ్రీయేసు జనియించె దీనగర్భమున..
    పరలోక నాధుండు – ధరనుద్భవించాడు
    ఇమ్మానుయేలుగ నేడు తోడుగవున్నాడు
    రండి చూడగవెళ్ళేదం, రక్షకుని భజియించెదం
    కనరండి, కన్యాతనయుని కొలిచెదం!
    ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్!
    ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల//

    బోళము సాంబ్రాణి, బంగారు కానుకలు
    సరిరావు ఎన్నటికీ, అర్పించు నీహృదయమ్
    అక్షయుడు దేవుడు,రక్షకుడు వచ్చాడు
    మోక్షాన్ని తెచ్చాడు, ఈమానవ మనుగడకు!
    ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు
    బలవంతుడుఐనవాడు నారాజు..
    ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్!
    ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల//


    Pashuvula paakalo devakumaarudu
    deenudai puttenu maanavaaliki..
    Aakaashaana dootalu paadi stutinchiri
    Gollalu jnaanulu poojinchiri
    Manase pulakinchenu Kreesthu janmatho
    Tanuve tariyinchenu raaju raakato..
    Koniyaadi keerthinchedamu
    Paravasinchi aaraadhinchedam //2//

    Yudaya deshamuna, Daaveedu puramandu
    Sree Yesu Janiyinche deena garbhamuna…
    Paraloka naadhundu, dharanudbhavinchaadu
    Emmaanuyeluga nedu todugavunnaadu
    Randi choodagavelledam, rakshakundu bhajiyinchedam
    Kanarandi, kanyaatanayuni kolichedam! //Pashuvula//

    Bolamu, saambrani, bangaaru kaanukalu
    Sariraavu ennatiki, arpinchu nee hrudayam
    Akshayudu devudu, rakshakudu vachaadu
    Mokshaanni techaadu, ee maanava manugadaku!
    Aascharyakarudu Yesu, aalochanakartha Kreesthu
    Balavantudu inavaadu naaraaju..
    Vullaasamuto paadedam, aanandamuto mrokkedam!
    Aadisambhootuni aarbhatinchedam! //Pashuvula//