Category: Telugu Worship Songs Lyrics

  • Pashushalalo neevu పశుశాలలో నీవు

    పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
    పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు //2//

    చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
    స్థలమైన లేదే జన్మకు! //2//
    తలవంచే సర్వ లోకము//2//పశు//

    స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
    ధరియించలేదే ఆయుధం!//2//
    వశమాయే జనుల హృదయాలు //2//పశు//

    పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
    మేఘాలలోనా వెళ్ళినావు! //2//
    త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//


    Pashushaalalo neevu pavalinchinaava, paramaatmudavu neevu;
    Pasibaludavu kaavu – Pasibaludavu kaavu //2//

    Chiruprayamande sastrulu, saritugalede bodhakulu! //2//
    Sthalamaina lede janmaku! //2//
    Talavanche sarva lokamu //2//Pashu//

    Sthapinchalede taragatulu, pratichota chooda nee paluke! //2//
    Dhariyinchalede aayudham! //2//
    Vashamaaye janula hrudayaalu //2//Pashu//

    Paapambu mosi kaluvarilo; odinchinaavu maranamunu! //2//
    Meghaalalona vellinaavu!//2//
    Twaralone bhuviki taraliuchunnaavu //2//Pashu//

  • Oranna Oranna Yesuku saativere leranna
    ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే లేరన్నా

    ఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే –
    లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/
    యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా!

    చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/
    అద్వితీయుడు, ఆది దేవుడు – ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/

    పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న /2/
    పరిషుద్దుడు, పావనుడు – ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/

    శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా /2/
    మహిమ ప్రభు, మృత్యుంజయుడు – క్షమియించును, జయమిచ్చును /2/ఓరన్నా/

    మహిమలు ఎన్నో చూపాడన్నా – మార్గం తానే అన్నాడన్నా /2/
    మనిషిగా మారిన దేవుడేగా – మరణం పాపం తొలగించెను /2/ఓరన్నా/


    Oranna Oranna Yesuku saativere leranna leranna
    Yese aa daivam chudanna … chudanna.. /2/
    Yese aa daivam chudanna..! chudanna..!

    Charitraloniki vachhadanna – Pavitra jeevam techhadanna! /2/
    Adviteeyudu, aadidevidu – Aadarinchunu, aadukonunu /2/oranna/

    Paramunu vidachi vachhadanna – Narulalo Narudai puttadanna! /2/
    Parishuddhudu, paavanudu – Preminchenu, praanamichhenu /2/

    Siluvalo praanam pettadanna – Maranam gelachi lechadanna! /2/
    Mahima prabhu, Mrutyujayudu – Kshamiyinchunu, Jayamichhunu /2/oranna/

    Mahimalu enno chupaadanna!- Maargam taane annadanna! /2/
    Manishiga maarina devudegaa – Maranam paapam tolaginchenu /2/

  • Nishabdam vinta nishabdam నిశ్శబ్దం వింత నిశ్శబ్దం

    నిశ్శబ్దం! వింత నిశ్శబ్దం! –క్రీస్తు నాలో పుట్టిన రోజు!
    నా క్రిస్మస్ పండుగ రోజు! –నిజ క్రిస్మస్ పండుగ రోజు!

    సర్వోన్నతమైన స్ధలములలో- దేవునికి మహిమ
    సకల చరాచర సృష్ఠిలో సమాధానము..
    ఆలాపన : అహా.. ఆహా. అహా.. ఆహా
    అహా…హా ఆహహ .. హా ఆహహహ
    ఆహహహ హా … ఆహహ హాఆ ఆ ఆ..

    నా మోసపు తలపుల తలపై –ముళ్లు గుచ్చ బడినవి
    నా మోహపు చూపుల మోముపై –ఉమ్మి వేయబడినది
    నా చీకటి చేతుల కాళ్లకు – శీలలు దిగగొట్టబడినవి
    కామ,క్రోద,మధమత్సర దేహంలో – బల్లెము దిగబడినది //నిశ్శబ్దం//

    నాకు నా వారికి నేను –వెలివేయబడినాను
    నాకు లోకానికి నేను –సిలువ వేయబడినాను
    వేలివేతలో సిలువ కోతలో –మృతుడైపోయాను
    ఇల నాలో ఇక జీవించేది –నేను కాను క్రీస్తే //నిశ్శబ్దం//


    Nishabdam vinta nishabdam! – Kreesthu naalo puttinaroju!
    Naa Christmas pandugaroju! – Nija Christmas panda roju!

    Sarvonnatamaina sthalamulalo – devuniki mahima
    Sakala charachara srustilo samaadhaanamu..
    Aha… Aha…..

    Naamosapu talapula talapai – Mullu guchhabadinavi
    Naamohapu choopula momupai – Ummiveyabadinadi
    Naa cheekati chetula kaallaku – Seelalu digagottabadinavi
    Kaama,krodha,madamatsara dehamlo
    Ballemu digabadinadi //Nishabdam//

    Naaku naavaariki nenu – Veliveyabadinaanu
    Naaku lokaaniki nenu – Siluvaveyabadinaanu
    Velivetalo siluvakotalo – Mrutudanaipoyaanu
    Ika naalo jeevinchedi – Nenu kaanu Kreesthe! //Nishabdam//

  • Ningilo Merise Nakshtram నింగిలోని మెరిసే నక్షత్రం

    బేత్లెహేములో రక్షకుడు ఉదయించినాడుగా.. పండగే పండగ !

    నింగిలోని మెరిసే నక్షత్రం – లోకమంతటికి వెలుగులు చూప //2//
    యేసయ్య పుట్టాడని.. – ఆయనె రక్షకుడని.. //2//
    పూజించి! కొనియాడి!//2// ఆరాధన చేద్దాం..
    లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2//

    నశియించి పోతున్న లోకాన్ని చూసి చీకటిలోవున్న నరులను చేర //2//
    వాక్యమై యున్న దేవుడు.. దీనుడై భువికేతెంచినాడు //2//
    పూజించి కొనియాడి //2// ఆరాధన చేద్దాం..
    లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2//

    పాపంలోవున్న ప్రతివారికొరకు
    ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించె //2//
    కరములు చాచియున్నాడు – దరిచేరితే నిన్ను చేర్చుకుంటాడు //2//
    పూజించి కొనియాడి //2// ఆరాధన చేద్దాం..
    లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2//నింగిలోన//


    Betlehemulo rakshakudu vudayinchinaadugaa… pandage pandaga!

    Ningiloni merise nakshatram
    Lokamantatiki velugulu choopa //2//
    Yesayya puttaadani… – Aayane rakshakudani… //2//
    poojinchi! Koniyaadi!//2// Aaraadhana cheddaam..
    Lokaaniki velugaayane – Paralokaaniki daaraayane //2//

    Nashiyinchipotunna lokaanni choosi
    cheekatilovunna narulanu chera //2//
    Vaakyamai yunna devudu… Deenidai bhuviketenchinaadu //2//
    poojinchi! Koniyaadi!//2// Aaraadhana cheddaam..
    Lokaaniki velugaayane – Paralokaaniki daaraayane //2//

    Paapamlovunna prativaarikoraku
    Praanaanni arpimpa paakalo pavalinche//2//
    Karamuluchaachiyunaadu – Daricherite nennucherchukuntaadu //2//
    poojinchi! Koniyaadi!//2// Aaraadhana cheddaam..
    Lokaaniki velugaayane – Paralokaaniki daaraayane //2//Ningilona//

  • Neeti suryudaina Yesu raakatone నీతిసూర్యుడైన యేసు రాకతోనే

    నీతిసూర్యుడైన యేసు రాకతోనే
    పాపభీతినొందు మానవాళి దిగులు పోయెనే /2/
    జ్యోతిర్మయుడైన దేవుడు తానె /2/
    భానుడుగా భువిపైన కాలుమోపగానే
    చీకటి శక్తులకు వణుకుపుట్టెనే /నీతి/

    ప్రభుసన్నిధిలో ఆనందముండును
    కీడుచేయు శత్రువులను దూరపరచును
    బంధకములను తెంపివేయను – మన బంధకములు తెంపివేయను
    ఇమ్మానుయేలుగా అవతరించెను – యెహోవా షమ్మా మన మధ్యనుండెను /నీతి/

    ప్రభు సన్నిధిలో ఆరోగ్యముండును
    పాడుచేయు రోగములను స్వస్థపరచును
    దుఃఖమును మాన్పివేయను – మన దుఃఖమును మాన్పివేయను
    ఆశ్చర్యకరుడుగా అవతరించెను –నీతిసూర్యుడుగా మన మధ్యనుండెను /నీతి/

    ప్రభుసన్నిధిలో సమాధానముండును
    వేరుచేయు పాపములను శుభ్రపరచును /2/
    చింతలను తీర్చివేయను – మన చింతలను తీర్చివేయను
    ఆపద్బాంధవుడిగా అవతరించెను – యెహోవా షాలోమ్ మన మధ్యనుండెను /నీతి/


    Neeti suryudaina Yesu raakatone
    paapabheetinondu maanavaali digulu poyene! /2/
    jyotirmayudaina devudu taane /2/
    Bhaanudugaa bhuvipaina kaalu mopagaane
    Cheekati shaktulaku vanuku puttenu /neeti/

    Prabhu sannidhilo aanandamundunu
    Keedu cheyu satruvulanu dooraparachunu
    Bandhakamulanu tempiveyunu – Mana bandhakamulu tempiveyunu
    Emmaanuyelugaa avatarinchenu
    Yehovaa shamma mana madhyanundenu /neeti/

    Prabhu sannidhilo aarogyamundunu
    paaducheyu rogamulanu swasthaparachunu
    Dukhamunu maanpiveyunu – Mana dukhamunu maanpiveyunu
    Aaschryakaruduga avatarinchenu
    Neeti suryuduga mana madhyanundenu /neeti/

    Prabhu sannidhilo samaadhaanamundunu
    verucheyu paapamulanu subharaprachunu /2/
    Chintalanu teerchiveyunu – mana chitalanu teerchiveyunu
    Aapadbhaandavuduga avatarinchenu
    Yehova shaalom mana madhyanundenu /neeti/

  • Memu velli Chuchinaamu మేము వెళ్లిచూచినాము

    మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తును
    ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ //మేము//

    బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁ
    బేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో //మేము//

    జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యము
    వాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము //మేము//

    తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగా
    హద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా //మేము//

    మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగము
    త్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము //మేము//

    పరిశుద్ధాత్మ జన్మ మాకు – వరముగా నొసంగెను
    పరమపురము మాకు హక్కు – పంచెదాను నిరతము //మేము//

    మాకు సర్వగర్వమణిగి – మంచి మార్గమబ్బెను
    మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను //మేము//


    Memu velli chuchinaamu swami Yesu Kreesthunu
    Prema mrokka vachhinaamu – Maa manambu lalaraga //Memu//

    Betalemupuramulona – beedakanya Mariyaku
    Bedagaa suropudaalchi – velase basulapaaalo //Memu//

    Jnaanulamani garvapadaka – deenulamai nityamu
    vaani prema sakala prajaku – maanaka prakatintumu //Memu//

    Taddarisanamandu maaku = beddamelu kaligeraa
    Hadduleni paapamanta – radduparachabadenuga //memu//

    Maranamepudo repomaapo – mariyepudo manamerugamu
    twaraga poyi paramaguruni – darishanambu jetamu //memu//

    Parishuddhatma Janma maaku – varamuga nosangenu
    Pramapuramu maaku hakku – panchedaanu niratamu //memu//

    Maaku sarvagarvamanigi – manchi maargamabbenu
    Maaku nee suvaartha jeppa makkuvento galigenu //memu//

  • Mee andariki Subhakankshalu మీ అందరికి శుభాకాంక్షలు

    మీ అందరికి… శుభాకాంక్షలు…. #2#
    క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం #2#
    Happy Christmas.. – Merry Christmas.. #2#

    ఏడాది గడచినను – తోడుగ నిలచిన దేవా
    మా పాపాలు పెరిగినను – ప్రాణాలు నిలపిన దేవా (2)
    నీ ప్రేమకు వెలలేదు – నీ కరుణను మా పై నిలపుమా (2)
    Happy Christmas.. – Merry Christmas.. #2#

    రాబొవు కాలములో – రక్షణనొసగుము దేవా..
    మా జీవితకాలమే – ముగియునేమో ఇలలోన (2)
    నీ సన్నిధి చేరుటకు – మార్గమును తెరువుమా (2)
    Happy Christmas.. – Merry Christmas.. #2#

    మీ అందరికి… శుభాకాంక్షలు…. /2/
    క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం /2/


    Mee andariki subhakankshalu /2/
    kreestesu janmadinam – Ee lokaanike subhadinam /2/
    Happy Christmas.. – Merry Christmas.. /2/

    Yedaadi gadachinanu – toduga nilachina deva
    Maa paapaalu periginanu – praanaalu nilapina deva /2/
    Nee premaku velaledu – Nee karunanu maapai nilapumaa /2/
    Happy Christmas.. – Merry Christmas.. /2/

    Raabovu kaalamulo rakshana nosagumu deva..
    Maa jeevita kaalame – mugiyunemo ilalona /2/
    Nee sannidhi cherutaku – maargamunu teruvumaa /2/
    Happy Christmas.. – Merry Christmas.. /2/

    Mee andariki subhakankshalu /2/
    kreestesu janmadinam – Ee lokaanike subhadinam /2/

  • Laali laali Laalamma laali లాలి లాలి లాలి లాలమ్మ లాలీ

    లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
    లాలియని పాడరే బాలయేసునకు.. లా…లి

    పరలోక దేవుని తనయుడో యమ్మా
    పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా.. లా…లి

    ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ
    మహి పాలనము జేయు మహితుడో యమ్మా.. లా…లి

    ఆద్యంతములు లేని దేవుడో యమ్మా
    ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా.. లా…లి

    యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా
    యూదు లాతని తోడ వాదించి రమ్మా.. లా…లి

    నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా
    గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా.. లా…లి


    Laali Laali Laali Laalamma laali
    Laali yani paadare baala Yesunaku… Laali..

    Paraloka Devuni tanayudoyamma..
    Pudamipai Blaaluduga buttenoyamma.. Laali..

    Iha paraadula kartha eetadoyamma…
    Mahipaalanamu jeya mahitudoyamaa.. Laali..

    Aadyantamulu leni Devudoyamma..
    Aadaamu doshamunakaddupadenamma.. Laali..

    Yudula raajuga buttenoyamma..
    Yudulaatanitoda vaadinchiramma.. Laali..

    Naragorrela manda kaaparoyamma…
    Goriyala praanambu Kreesthu taanamma.. Laali..

  • Jyotrmayuni jananam జ్యోతిర్మయుని జననం

    జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి
    సంబరమే సంబరమే – జగమంతా సంబరమే
    ఆరాధింపరండి ఆనందింపరండి //2//
    రాజా నీకే స్తోత్రము – శ్రీయేసురాజా నీకే స్తుతి స్తోత్రము //2//

    పాపాచీకటి తొలగింప వెలుగుగా వచ్చెను …
    వ్యాధిబాధలుతొలగింప వైద్యునిగా వచ్చెను //2//
    అద్భుతకరుడు – ఆదిదేవుడు
    ఆశ్చర్యకరుడు – అద్వితీయుడు //2//రాజా//

    పస్కా బలిపశుతానై -గొఱ్ఱెపిల్లగ వచ్చెను …
    చెదరిన మందను సమకూర్చ – కాపరిగా వచ్చెను //2//
    మంచికాపరి గొప్పకాపరి – ఆత్మలకాపరి ప్రధానకాపరి //2//రాజా//

    ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చేను..
    చచ్చిన మనలను బ్రతికింప – జీవముగా వచ్చెను //2//
    శ్రీమంతుడు శ్రీయేసుడు – రాజాధిరాజు షాలేమురాజు //2//రాజా//


    Jyotrmayuni jananam sarvalokaaniki
    sambarame sambarame – jagamantaa sambarame
    Aaraadhimparandi aanandimparandi //2//
    Raaja neeke stotramu – Sree Yesu raaja neeke stuti stotramu //2//

    Paapacheekati tolagimpa valugugaa vacheenu..
    Vyaadhibaadhalu tolagimpa vaidyunigaa vachhenu //2//
    Adbhutakarudu – aadhidevudu
    Ascharyakarudu – Adviteeyudu //2//raajaa//

    Paskabalipashu taanai – Gorrepillaga vachhenu…
    Chedarina mandanu samakoorcha – kaapariga vachhenu //2//
    Manchikaapari Goppakaapari – Atmalakaapari Pradhaanakaapari //2//Raaja//

    Dhanavantulugaa cheyutaku deenudugaa vachhenu..
    Chachhina manalanu bratikimpa – Jeevamugaa vachhenu //2//
    Sreemantudu Sreeyesudu
    Raajaadhiraaju Shaalemuraaju //2//Raaja//

  • Jeevamai ethenchina జీవమై ఏతెంచిన

    జీవమై ఏతెంచిన యేసు దైవమా
    దేహమే ధరించిన ఆత్మ రూపమా
    స్నేహమే కోరిన తండ్రి ప్రేమ సాక్షమా

    దూతావళి స్తోత్రాలతో కీర్తించబడువాడవు
    లోక కల్యాణమే నీ జన్మ పరమార్థము
    నీవే మా ప్రాణము

    ఆద్యంతునే సంకల్పమే నెరవేరే సంతోషము
    శాంతి సందేశమే లోకమంతా వినిపించెను
    నీవే మా భాగ్యము


    Jeevamai ethenchina yesu daivamaa
    Dhehame dharinchina aathma roopamaa
    Snehame korina thandri prema saakshamaa

    Dhoothaavali sthothraalatho keerthinchabaduvaadavu
    Loka kalyaaname nee janma paramaarthamu
    Neeve maa praanamu

    Aadyanthune sankalpame neravere santhoshamu
    Shanthi sandesame lokamanthaa vinipinchenu
    Neeve maa bhaagyamu