Category: Telugu Worship Songs Lyrics

  • Goppa Goppa karyalu chesevadu గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు

    గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
    మాటతోనె మహిమలెన్నో చూపేవాడు /2/
    కన్నీటిని నాట్యముగా మార్చేవాడు /2/
    లోకాన ఇటువంటి దేవుడు లేడు

    Bridge:
    {యెసయ్యే ఆ దేవుడు – జన్మించినాడు బేత్లెహేములో
    అందరికి ఒకే దేవుడు – పరుండినాడు పశుల పాకలో } X /2/

    గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
    మాటతోనె మహిమలెన్నో చూపేవాడు (యేసు) /2/

    మృతులైన వారిని లేపాడు
    పుట్టు కుంటివారిని బాగుచేశాడు /2/
    మనకోసం ప్రాణాలే పెట్టాడు /2/
    మరణించి మరి తిరిగి లేచాడు /Bridge/

    దీనులపై తన దయను చూపిస్తాడు
    నశియించు వారినెల్ల రక్షిస్తాడు (యేసు) /2/
    పాపినైన ప్రేమతో క్షమియిస్తాడు
    రక్షించి పరలోకం మనకిస్తాడు /Bridge/


    Goppa goppa kaaryaalu chesevaadu
    Maatatone mahimalenno chupepaadu /2/
    Kannetini naatyamuga maarchevaadu /2/
    Lokaana ituvanti devudu ledu

    Bridge:
    {Yesayye aa devudu – Janminchinaadu Betlehemulo
    Andariki oke devudu – Parundinaadu pashula paakalo} X/2/

    Goppa goppa kaaryaalu chesevaadu
    Maatatone mahimalenno chupepaadu (Yesu)/2/

    Mrutulaina vaarini lepaadu
    Puttu kunivaarini baaguchesaadu /2/
    Manakosam praanaale petaadu /2/
    Maraninchi mari tirigi lechaadu /Bridge/

    Deenulapai tana dayanu choopistaadu
    Nasiyinchu vaarinella rakshistaadu (Yesu) /2/
    Paapainaina prematho kshamiyistaadu
    Rakshinchi paralokam manakistaadu /Bridge/

  • Enta deenaatideenamo ఎంత దీనాతి దీనమో

    ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2//
    నీ జనన మెంత దయనీయమో….
    తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత//

    నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2//
    ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత//

    నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2//
    దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత//

    చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2//
    పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత//


    Enta deenaatideenamo… O Yesayyaa //2//
    Nee jananamenta dayaneeyamo…
    Talachukunte naa gunde tadabadi
    taragi karigi neeraguchunnadi! //Enta//

    Nee srustilo ee lokame neevu maaku ichhina satramayyaa //2//
    Aa satramulo O Yesayya neeku sthalame dorakaledayya //Enta//

    Nindu choolaalu Mariyamma talli Nadavaleka sudivadipoyenayyaa //2//
    Dikkutochaka o Yesayyaa – Pashulapaakalo prasavinchenayya //Enta//

    Challagaalilo chaatuleka nalumoolala chaliputtenayya //2//
    Pasikanduvai o Yesayya Tallivodilo odiginaavayya //Enta//

  • Emmanuelu Jananam ఇమ్మానుయేలు జననం

    ఇమ్మానుయేలు జననం – పరిశుద్ధతకే సంకేతం
    పరమాత్ముని ప్రేమస్వరూపం – ప్రజలందరి రక్షణ మార్గం
    “ప్రభువు తేజము వెల్లివిరిసెను – లోకమంతా పండుగాయెను
    దీన జనులకు – అనుదినమంతా”

    ప్రభువు నీకు తోడైయుండగ పొందితి దేవుని కృపలని
    పరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఆయన శక్తిని కమ్ముకొని
    పరిశుద్ధునిగా పుట్టిన శిశువే సర్వోన్నతునిగ నిలుచునని
    పంపబడిన దేవదూత చెప్పెను – కన్య మరియకు శుభమని //ఇమ్మానుయేలు//

    ఇశ్రాయేలను ప్రజలను పరిపాలించే అధిపతి
    బేత్లెహేమను ఊరి సత్రములో – యూదుల రాజుగ యేసు పుట్టెను
    పొత్తిగుడ్డలతో చుట్టి యేసుని పశువుల తొట్టిలో పరుండబెట్టిరి
    ఆయన జన్మకు ఆనవాలుగా తూర్పున ఓ తార ఉదయించెను //ఇమ్మానుయేలు//

    పాపుల రక్షణ పరమార్ధముగా యేసు పుట్టెనని తెలుసుకొని
    తూర్పు దేశపు జ్ఞానులాయనను పూజింపగా వచ్చితిమని
    ఇంటినిజొచ్చి తల్లి మరియను శిశువునుజూచి సంతసించిరి
    సాగిలపడి బంగారు సాంబ్రాణి బోళములను వారర్పించిరి //ఇమ్మానుయేలు//


    Emmanuyelu jananam – Parishuddhatake sanketam
    Paramaatmuni prema swaroopam – Prajalandari rakshana maargam
    “Prabhuvu tejamu vellivirisenu – lokamanta
    Pandugaayenu deena janulaku – Anudinamantaa”

    Prabhuvu neeku todaiyundagaa ponditi devuni krupalani
    Parishuddhaatmato garbhamu dharinchi aayana shakthini kammukoni
    Parishuddhunigaa puttina sishuve sarvonnatuniga nilachunani
    Pampabadina devadoota cheppenu – kanya mariyaku subhamani //Emmanuyelu//

    ​Israayelanu prajalanu paripaalinche adhipati
    Belehemanu oori satramulo – Yudula raajuga Yesu puttenu
    Pottiguddalatho chutti Yesuni pashuvula tottilo parundabettiri
    Sayana janmaku aanavaaluga toorpuna otaara vudayinchenu //Emmaanuyelu//

    Paapula rakshana paramaardhamugaa Yesu puttenani telusukoni
    Toorpudeshapu jnaanulaayananu poojimpagaa vachhitimani
    Intinijochhi talli Mariyanu sishuvunujoochi santasinchiri
    Saagilapadi bangaaru saabraani bolamulanu vaararpinchiri //Emaanuyelu//

  • Divinelu o Raja దివినేలు ఓ రాజా

    దివినేలు ఓ రాజా – భువికేల నీరాక
    దూతాళి నిను కొలువ – పాపులా నీ ప్రియులు.. /2/
    దివినేలు ఓ రాజా..

    పరలోకమున నీకు – నరలోకమున నాతో /2/
    మురిపాలు ముచ్చటలు – సరితూగవే వేటితో.. /దివి/

    పలుమార్లు నిను తలువ – మనసాయే నా దేవా /2/
    ప్రియమార నిను పిలువా – పలికేవ నా ప్రభువా … /దివి/

    సిలువలో నీ మేను బలియాయె నా కొరకు /2/
    వెలలేని నీ కరుణ – కలనైన మరువగలనా .. /దివి/


    Divinelu o Raja.. Bhuvikela nee raaka
    Dootaali ninu koluva – Paapula nee priyulu.. /2/
    Divinelu o Raja..

    Paralokamuna neeku – Naralokamuna naato /2/
    Muripaalu muchhatalu – Saritoogave vetito… /Divi/

    Palumaarlu ninu taluva – Manasaaye naa devaa /2/
    Priyamaara ninu piluva – Palikeva naa prabhuva.. /Divi/

    Siluvalo nee menu – Baliyaaye naa koraku /2/
    Velaleni nee karuna – Kalanaina maruvagalanaa.. /Divi/

  • Ambara Veedhilo Vintaina Taaraka అంబరవీధిలో వింతైన తారక

    అంబరవీధిలో వింతైన తారక /2/
    సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/
    అంబరవీధిలో వింతైన తారక
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/

    దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగా
    కారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/
    సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగ
    సర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/

    దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగా
    గొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/
    జ్ఞానులంతా ప్రణమిల్లి కానుకలే అర్పించగా
    క్రీస్తుయేసుని జననంతో భువియే పులకరించగా /2/
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/అంబర /


    Ambara Veedhilo Vintaina taaraka /2/
    Sandadichesenanta! Subhavaartha techhindata! /2/
    Ambara Veedhilo Vintaina taaraka
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/

    Daarichupe taaraka – Kreesthu chentaku cheraga
    Kaarucheekati mabbulalo kaantiye prasarinchaga /2/
    Sarva lokaaniki – Kreesthu Jananame chaataga
    Sarvonnatudaina Devuniki Niya Mahimai Cherenugaa /2/
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/

    Dutalantaa yekamai stutigaanaale paadagaa
    Gollalemo paravasamai koodi naatyam cheyagaa /2/
    Jnaanulanta pranamilli kaanukale arpinchagaa
    Kreestu yesuni jananamto – bhuviye pulakarinchaga /2/
    Chorus: Wish you we wish you,
    we wish you happy Christmas /4/

  • Aakasaana sukka elese అకసాన సుక్కఎలిసె

    అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
    సీకటంత పారిపాయెరా //2//
    మా సిక్కులన్ని తీరిపాయెరా
    మా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//
    సంబరాలు ఈయాల సంబరాలు
    క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//

    గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేక
    మందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//
    ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –
    ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//
    ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..
    ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన//

    సల్లగాలివీసీంది సుక్కా దారి సూపింది
    జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
    బంగారు బోల కానుకలు తెచ్చారు
    వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
    ఆ దూతలంతా గానాలు చేశారు…..
    లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా //2//అకసాన//


    Aakasaana sukka elese ardharaatri poddu podise
    Cheekatanta paaripoyeraa.. //2//
    Maa sikkulanni teeripaayera
    Maa dikke mokku Yesudaayera.. //2//
    Sambaraalu Iyaala sambaraalu
    kreestu janma pandaganta sambaraalu //3//

    Gollalanta raatirela kantimeeda kunukuleka
    mandalanu kaayuchundagaa .. Chali mantalanu kaayuchundagaa
    Aa mantakaada edopedda elugochhe
    Aa elugulona devadoota kanipinche //2//
    emantademonani gunde dadabutte…
    Yesu janma vaartha telipera.. doota choosirammani cheppera… //2//Aakasana//

    Sallagaali eesindi sukkadaari soopindi
    Jnaanulanta paakacheriri – raraaju daiva sutuni gaanchiri //2//
    Bangaarubola kaanukalu techhaaru
    Vaaru mokarinchi Yesuprabhuni mokkaaru //2//
    Aa dootalanta gaanaalu chesaaru…
    Lokamanta elugu nindera – Ee maanavaali bratuku pandera… //2//Aakasana//

  • Krupamayuda Neelona కృపామయుడా – నీలోనా

    కృపామయుడా – నీలోనా (2)
    నివసింప జేసినందున
    ఇదిగో నా స్తుతుల సింహాసనం
    నీలో నివసింప జేసినందునా
    ఇదిగో నా స్తుతుల సింహాసనం
    కృపామయుడా…

    ఏ అపాయము నా గుడారము
    సమీపించనీయక (2)
    నా మార్గములన్నిటిలో
    నీవే ఆశ్రయమైనందున (2) [కృపామయుడా]

    చీకటి నుండి వెలుగులోనికి
    నన్ను పిలచిన తేజోమయా (2)
    రాజవంశములో
    యాజకత్వము చేసెదను (2) [కృపామయుడా]

    నీలో నిలిచి ఆత్మ ఫలము
    ఫలియించుట కొరకు (2)
    నా పైన నిండుగా
    ఆత్మ వర్షము కుమ్మరించు (2) [కృపామయుడా]

    ఏ యోగ్యత లేని నాకు
    జీవ కిరీటమిచ్చుటకు (2)
    నీ కృప నను వీడక
    శాశ్వత కృపగా మారెను (2) [కృపామయుడా]


    Krupaamayudaa – Neelona (2)
    Nivasimpa Jesinanduna
    Idigo Naa Sthuthula Simhaasanam
    Neelo Nivasimpa Jesinandunaa
    Idigo Naa Sthuthula Simhaasanam
    Krupaamayudaa…

    Ae Apaayamu Naa Gudaaramu
    Sameepinchaneeyaka (2)
    Naa Maargamulannitilo
    Neeve Aashrayamainanduna (2) [Krupaamayudaa]

    Cheekati Nundi Velugu Loniki
    Nannu Pilachina Thejomayaa (2)
    Raaja Vamshamulo
    Yaajakathvamu Chesedanu (2) [Krupaamayudaa]

    Neelo Nilichi Aathma Phalamu
    Phaliyinchuta Koraku (2)
    Naa Paina Nindugaa
    Aathma Varshamu Kummarinchu (2) [Krupaamayudaa]

    Ae Yogyatha Leni Naaku
    Jeeva Kireetamichchutaku (2)
    Nee Krupa Nanu Veedaka
    Shaashwatha Krupagaa Maarenu (2) [Krupaamayudaa]

  • Tenekana Thiyanainadi తేనెకన్న తీయనైనది

    తేనెకన్న తీయనైనది
    నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
    నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
    కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||

    ఆగకనే సాగిపోదును
    నా ప్రభువు చూపించు బాటలో (2)
    అడ్డంకులన్ని నన్ను చుట్టినా
    నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||

    నా వాళ్ళే నన్ను విడిచినా
    నా బంధువులే దూరమైనా (2)
    ఏ తోడు లేక ఒంటరినైననూ
    నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||


    Tenekanna Thiyanainadi
    Naa Yesu Prema – Mallekanna Thellanainadi (2)
    Nannu Preminchenu Nannu Rakshinchenu
    Kashtakaalamandu Naaku Thodaiyundenu (2) ||Tenekanna||

    Aagakane Saagipodunu
    Naa Prabhuvu Choopinchu Baatalo (2)
    Addankulanni Nannu Chuttinaa
    Naa Devuni Ne Viduvakundunu (2) ||Tenekanna||

    Naa Vaalle Nannu Vidichinaa
    Naa Bandhuvule Dhooramainaa (2)
    Ae Thodu Leka Ontarinainanoo
    Naa Thodu Kreesthani Aanandinthunu (2) ||Tenekanna||

  • Tara Velisindi Aa Ningilo తార వెలిసింది ఆ నింగిలో

    తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
    దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
    రాజులకు రాజు పుట్టాడని
    యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||

    మందను విడచి మమ్మును మరచి
    మేమంతా కలిసి వెళ్ళాములే
    ఆ ఊరిలో ఆ పాకలో
    స్తుతి గానాలు పాడాములే (2)
    సంతోషమే ఇక సంబరమే
    లోక రక్షణ ఆనందమే
    స్తోత్రార్పణే మా రారాజుకే
    ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||

    బంగారమును సాంబ్రాణియు
    బోళంబును తెచ్చాములే
    ఆ యింటిలో మా కంటితో
    నిను కనులారా గాంచాములే (2)
    మా ఇమ్మానుయేలువు నీవేనని
    నిను మనసారా కొలిచాములే
    మా యూదుల రాజువు నీవేనని
    నిను ఘనపరచి పొగిడాములే ||తార||


    Tara Velisindi Aa Ningilo Dharani Murisindi
    Dootha Vachchindi Suvaarthanu Maaku Thelipindi (2)
    Raajulaku Raaju Puttaadani
    Yoodula Raaju Udayinchaadani (2) ||Tara||

    Mandanu Vidachi Mammunu Marachi
    Memanthaa Kalisi Vellaamule
    Aa Oorilo Aa Paakalo
    Sthuthi Gaanaalu Paadaamule (2)
    Santhoshame Ika Sambarame
    Loka Rakshana Aanandame
    Sthothraarpane Maa Raaraajuke
    Idi Christmas Aarbhaatame ||Tara||

    Bangaaramunu Saambraaniyu
    Bolambunu Thechchaamule
    Aa Yintilo Maa Kantitho
    Ninu Kanulaaraa Gaanchaamule (2)
    Maa Immaanuyeluvu Neevenani
    Ninu Manasaaraa Kolichaamule
    Maa Yoodula Raajuvu Neevenani
    Ninu Ghanaparachi Pogidaamule ||Tara||

  • Tambura Sitara Nadamutho తంబుర సితార నాదముతో

    తంబుర సితార నాదముతో
    క్రీస్తును వేడగ రారండి
    ఇద్దరు ముగ్గురు కూడిన చోట
    ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||

    పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
    పాపుల పంక్తిని కూర్చొని (2)
    విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||

    ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
    నీ శోధనలను సమిధలుగా (2)
    నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||


    Thambura Sithaara Naadamutho
    Kreesthunu Vedaga Raarandi
    Iddaru Mugguru Koodina Chota
    Untaananina Swaamike (2) ||Thambura||

    Paapulakai Digi Vachchenata – Rogulake Vaidyudani
    Paapula Pankthini Koorchoni (2)
    Vindulu Chesina Yesunake – Pedala Paalita Pennidhike ||Thambura||

    Prathi Hrudayam Prabhu Mandiramai – Velugulatho Vilasilli
    Nee Shodhanalanu Samidhalugaa (2)
    Narakaagnulalo Padavesi – Kreesthunu Cheraga Parugidavaa ||Thambura||